Friday, December 20, 2024

రోడ్డు ప్రమాదంలో హీరోయిన్కి తీవ్రగాయాలు..పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరువనంతపురంలో స్కూటీపై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. దీంతో అరుంధతిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా… వైద్యులు ఆమెను ఐసియులో వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

‘నా స్నేహితురాలు అరుంధతికి నిన్న ప్రమాదానికి గురైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది. రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత ఆమె కుటుంబానికి లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ఆమె చికిత్సకు అది సరిపోదు. ఆమె కుటుంబానికి సహాయకారిగా ఉండేందుకు మీరూ కూడా సహాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది’ అంటూ సీరియల్ నటి గోపిక అనిల్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను అభ్యర్ధిస్తూ..బ్యాంకు, ఫోన్‌ నంబర్‌ వివరాలను తెలిపింది

కాగా, అరుంధతి నాయర్‌ మలయాళంలో దాదాపు ఎనిమిది సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పలు వెబ్ సిరీస్ లోనూ ఆమె నటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News