Friday, December 20, 2024

6 రాష్ట్రాల్లో హోంశాఖ అధికారులపై ఇసి వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు తీసుకునే చర్యలలో భాగంగా గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో హోం కార్యదర్శులను తొలగించాలని, ఎన్నికల కమిషన్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కూడా తొలగించాలని ఇసి ఆదేశించింది. అంతేగాక మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా శాఖల(జిఎడి)కు చెందిన కార్యదర్శులను కూడా తొలగిస్తూ ఉదేశాలు ఇసి ఆదేశాలు జారీచేసింది.

ఈ నెల 16న(శనివారం) లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సిఇసి రాజీవ్ కుమార్ బృమన్‌ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ ఛాహల్, అదను కమిషనర్లు, డిప్యుటీ కమిషనర్లను కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న లేదా తమ సొంత జిల్లాలలో పనిచేస్తున్న ఎన్నికల సంబంధిత విధులను నిర్వర్తిస్తున్న అధికారులందరినీ బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కమిషన్ ఆదేశించింది. కొన్ని మున్సిపల్ కమిషనర్లు, కొందరు అదనపు, డిప్యుటీ మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయలేదు.

దీనిపై ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన కమిషనర్, అదనపు, డిప్యుటీ కమిషనర్లను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన కమిషనర్లు, అదనపు, డిప్యుటీ కమిషనర్లను కూడా ఇదే ప్రకారం బదిలీ చేయాలని చీఫ్ సెక్రటరీని ఇసి ఆదేశించింది. సోమవారం నాడిక్కడ సమావేశమైన సిఇసి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News