- Advertisement -
చెన్నై: తమిళనాడులో ఎట్టకేలకు డీఎంకే, కాంగ్రెస్ మధ్య లోక్సభ ఎన్నికల కోసం సీట్ల ఒప్పందం కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం 39 స్థానాల్లో కాంగ్రెస్ 9 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆదివారం ముంబైలో ముఖ్యమంత్రి స్టాలిన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల మధ్య జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో విరుదునగర్, శివగంగై, తిరునల్వేలి, కన్యాకుమారి, మైలాడుతులై, కరూర్, కృష్ణగిరి, తిరువళ్లూరు, కడలూరు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి లోక్సభ నియోజకవర్గంలో కూడా పోటీ చేయనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, డిఎంకె పార్టీలు ఇప్పటికే ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి.
- Advertisement -