Sunday, December 22, 2024

జీపు, ట్రాక్టర్ ఢీకొని 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీహార్ ఖగారియా జిల్లాలో సోమవారం ఉదయం ఒక ట్రాక్టర్‌ను జీపు ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది వ్యక్తులు మరణించారని పోలీసులు తెలియజేశారు. వారంతా జీపులో ప్రయాణిస్తున్నారు. పస్రహా ప్రాంతంలో జాతీయ రహదారి 31పై ఒకపెట్రోల్ బంక్ సమీపాన సోమవారం ఉదయం సుమారు 5.15 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో మరి ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

‘ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గాయాలతో మరణించారు. గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం భాగల్పూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు’ అని పోలీసులు ఆ ప్రకటనలో వివరించారు. జీపులో ప్రయాణిస్తున్నవారు ఒక వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్‌లో కూడా పరిమితికి మించి వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News