- Advertisement -
మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో ఆఫ్రికా చీతా గామిని ఆరు కూనలకు జన్మనిచ్చిందని, ఐదివరకు ప్రకటించినట్టు ఐదు కాదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం వెల్లడించారు. ఐదేళ్ల వయసున్న దక్షిణాఫ్రికా చీతా ఐదు కూనలకు జన్మనిచ్చిందని మార్చి 10న మంత్రి యాదవ్ సమాచారం వెల్లడించారు. మొట్టమొదటిసారి ఈ చీతాకు ఆరు కూనలు పుట్టడం ఒక రికార్డుగా మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ కూనల విజువల్స్ షేర్ చేశారు. ఇప్పుడు పుట్టిన ఆరు చీతా కూనలతో కలిపి కునో పార్కులో 14 కూనలతోసహా మొత్తం చీతాల సంఖ్య 27కు పెరిగింది.
- Advertisement -