Monday, December 23, 2024

బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా మంద ప్రభాకర్ నియామకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మంద ప్రభాకర్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఈనిర్ణయం తీసుకుంది. ప్రవీణ్‌కుమార్ కంటే ముందు మంద ప్రభాకర్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈసందర్భంగా ఆయన బిఎస్పీ, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని 17 స్థానాల్లో అన్నింటిలో ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. బిఎస్పీ చీఫ్ మాయావతి ఆదేశాల మేరకు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉండదన్నారు. అదేవిధంగా మరే ఇతర పార్టీతో కూడా జత కట్టమని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News