Monday, December 23, 2024

సుప్రీంలో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఎంఎల్‌సి కవిత వెనక్కి తీసుకున్నారు. ఇడి సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే ఎంఎల్‌సి కవితను ఇడి అరెస్టు చేసిన  నేపథ్యంలో రిట్ పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో వెనక్కి తీసుకున్నామని ఆమె తరుపు న్యాయ వాది విక్రమ్ చౌదరి పేర్కొన్నారు.  పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ బెంచ్ అనుమతించింది. చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని చౌదరి పేర్కొన్నారు. ఇడి సమన్లపై గతేడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News