- Advertisement -
అమరావతి: ఒఎన్‌జిసిలో వెయ్యి కోట్ల నష్ట పరిహారాన్ని కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి కొట్టేశారని టిడిపి నేత, మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆరోపణలు చేశారు. కొండబాబు, మత్సకారులు కాకినాడ కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడారు. మత్యకారులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని, వైఎస్‌ఆర్‌సిపి, ద్వారంపూడికి కలెక్టర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ద్వారం పూడి అనుచరులు, వైసిపి కార్యకర్తలతో ఎందుకు సమావేశామయ్యారని కొండబాబు అడిగారు. మత్య్సకారులు, బోటు యజమానులతో కలెక్టర్ సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. మత్య్సకారులకు ఒఎన్‌జిసి సంస్థ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని కొండబాబు పిలుపునిచ్చారు.
- Advertisement -