Sunday, December 22, 2024

స్టాన్లీ కేసులో.. ఆంటోనియో ఒబింటా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీ కేసులో మరొకరు చిక్కారు. నెదర్లాండ్స్ నుంచి డ్రగ్స్ పంపించిన ఆంటోనియో ఒబింటా అరెస్ట్ అయ్యాడయ్యాడు. ఒబింటా అలియాస్ ఓక్రాను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గోవా జైలులో ఉన్న ఓక్రాను పిటీ వారెంట్ పై పోలీసులు తీసుకొచ్చారు. ఓక్రాను  పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఓక్రాకు 14 రోజుల రిమాండ్ విధించి, చంచల్ గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. నిందితుడిని 7 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. స్టాన్లీ ఇచ్చే డ్రగ్స్ ఆర్డర్ తీసుకుని ఓక్రా నెదర్లాండ్స్ నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నాడు. సౌరభ్ అనే వ్యక్తి పుణెలో డ్రగ్స్ తీసుకుని స్టాన్లీకి అందిస్తున్నాడు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు స్టాన్లీ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News