Friday, December 20, 2024

గుజరాత్ బిజెపి ఎమ్‌ఎల్‌ఎ కేతన్ ఇనామ్‌దార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ లోని వడోదర్ జిల్లా సావ్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ కేతన్ ఇనామ్‌దార్ తన ఎమ్‌ఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. అయితే తాను పార్టీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గం లోని సీనియర్ అధికారులు తనను పట్టించుకోవడం లేదని, పదవి కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని, అందుకే రాజీనామా చేసినట్టు చెప్పారు. తన రాజీనామా లేఖను స్పీకర్ శంకర్ చౌదరికి సమర్పించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో వడోదర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ విజయం కోసం పనిచేస్తానని కేతన్ ఇనామ్‌దార్ తెలిపారు. కేతన్ ఇనామ్‌దార్ సావ్లీ నుంచి మూడు సార్లు ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికయ్యారు. 2020లో ఒకసారి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News