Saturday, November 23, 2024

2026లో బుల్లెట్ రైలు పరుగులు: కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలపై పరుగులు పెడుతుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటు లోకి వస్తుందన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మంత్రి తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. బుల్లెట్ రైలు కోసం 500 కిమీల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టగా, భారత్ కేవలం 810 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తిచేయనుందని, అదికూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కనుందని మంత్రి వివరించారు.

మొదట గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నామని, 2028 నాటికి ముంబై అహ్మదాబాద్ మార్గం పూర్తిగా అందుబాటు లోకి రానుందని వివరించారు. దేశం లోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్ ముంబై మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్ పొడవు 508.17 కిమీ. ఇది అందుబాటు లోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు.

డిసెంబర్ నాటికి చిప్
ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్ తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. వికసిత్ భారత్ కు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం చాలా కీలకమైనదని, రానున్న ఐదేళ్లలో సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో టాప్ 5 దేశాల్లో భారత్ నిలుస్తుందన్న విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. అమెరికా చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీతో ఒప్పందం కుదిరిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మనదేశం లోని ఈ ప్లాంట్ నుంచి తొలి మేడిన్ ఇండియా చిప్ రానుందని పేర్కొన్నారు. గుజరాత్ లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ 2026 డిసెంబరు నాటికి చిప్‌లను ఉత్పత్తి చేయనుందని వైష్ణవ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News