Monday, December 23, 2024

‘అ’క్రమబద్ధీకరణ

- Advertisement -
- Advertisement -

జిఓ 59 అమలులో అక్రమాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : జిఓ 59 కింద క్రమబద్ధీకరణ విషయం లో కన్వెయన్స్ డీడ్స్‌తో అధికారుల ను, ప్ర భుత్వాన్ని కొందరు తప్పుదా రి పట్టించినట్టుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందడంతో వాటిని రిజిస్ట్రేష న్ చేయవద్దని, ఒకవేళ రిజిస్ట్రేషన్ జ రిగినా వాటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో వాటి క్రయ,విక్రయాలునిలిచిపోయాయి. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్న వారి స్థలాలను రెగ్యులరైజ్ చేయడానికి గ త ప్రభుత్వం జీఓ 59 తీసుకురాగా ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు వందల కోట్ల స్థలాలను క్రమబద్ధీకరణ పేరుతో స్వాహా చేసినట్టు గా తేలింది. క్రమబద్ధీకరణ కో సం చేసుకున్న దరఖాస్తులో నకిలీ పత్రాలను జత చేశారని సిసిఎల్‌ఏ గుర్తించడంతో పాటు వాటికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. గత ప్రభుత్వ హ యాంలో కొందరు రెవెన్యూ అధికారులు జిఓ 59 కిం ద దరఖాస్తులను పరిశీలించకుండా వందలు, వేల గజాలతో పాటు ఎకరాల్లో కన్వెయన్స్ డీడ్స్ జారీ చేశారని ప్రభు త్వం గుర్తించింది. దీంతోపాటు ఒక్కో కుటుంబానికి మూ డు, నాలుగు ప్లాట్లను కట్టబెట్టినట్టుగా తేలింది. ప్రభుత్వానికి రూ.100 కోట్లు వచ్చే చోట రూ.5 నుంచి రూ.10 కోట్లను మాత్రమే క్రమబద్ధీకరణ చార్జీల కింద రెవెన్యూ అధికారులు వసూలు చేశారని ప్రభుత్వం గుర్తించింది.
నోటరీలు ఎప్పుడు రాసుకున్నారు?
అయితే దరఖాస్తుతో పాటు జత చేసిన డాక్యుమెంట్లు ఒరిజినలా? నకిలీవా? నోటరీలు ఎప్పుడు రాసుకున్నారు? ఈ మధ్య కాలంలోనే సంతకాలు చేశారా? లేదా అన్న సందేహాలు తలెత్తడంతో ఈ క్రమబద్ధీకరణ అంశం మొదటికొచ్చింది. ఆయా స్థలాల్లో కనీసం ఓ పూరి గుడిసె లేకున్నా ఆ స్థలంలో దరఖాస్తుదారుడు కొన్నేళ్ల నుంచి ఉంటున్నట్లు రెవెన్యూ అధికారులు నివేదిక ఇవ్వడంతో ఇప్పుడన్నీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నట్టుగా తేలింది. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాల్లో గజం రూ.3 లక్షల దాకా పలికే స్థలాలను రూ.10 నుంచి రూ.12 వేల చొప్పున అధికారులు వసూలు చేసి కన్వేయన్స్ డీడ్స్ చేయడం విశేషం. ఇలా ఒక్క రంగారెడ్డి జిల్లాలోని అధికారులు పెద్దలకు అనుకూలంగా అతి తక్కువకు కన్వేయన్స్ డీడ్స్ చేయడంతో సుమారు రూ.30 నుంచి రూ.40 వేల కోట్ల రాబడి ప్రభుత్వానికి రాకుండా పోయిందని ప్రభుత్వం గుర్తించింది. ఇలా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి తదితర జిల్లాలో జరిగిందని ప్రభుత్వానికి సిసిఎల్‌ఏ సమర్పించిన నివేదికలో పేర్కొంది.
బాండ్ పేపర్ వివరాలపై ఆరా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో గజం రూ.లక్షల్లో పలుకుతోంది. అయితే అక్కడి స్థలాలను వ్యాపార, వాణిజ్య వేత్తలు, రాజకీయ నాయకులకు నోటరీల ద్వారా కొనుగోలు చేసినట్టు బయటపడడం, ఆ స్థలాలకు కన్వేయన్స్ డీడ్స్ చేయడంతో ప్రస్తుతం అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. రెగ్యులరైజేషన్ కోసమే ఈ మధ్య కాలంలో బాండ్ పేపర్లు కొనుగోలు చేసి పాత తేదీలతో నోటరీ చేయించుకున్నారని అధికారుల విచారణ వెల్లడి కావడంతో ఈ బాండ్ పేపర్‌ల కొనుగోళ్లపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఒకవేళ పాత బాండ్ పేపర్లయితే వాటిని ఎవరి పేరిట తీసుకున్నారు? ఎవరు వినియోగించుకున్నారు? నోటరీలు కొనుగోలు చేసిన, వినియోగించుకున్న వారి మధ్య సంబంధం ఏమిటన్న విషయాలపై సిసిఎల్‌ఏ ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. ఈ బాండ్ పేపర్లు విక్రయించిన వారి వివరాలను కూడా సేకరించాలని ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను సిసిఎల్‌ఏ ఆదేశించినట్టుగా సమాచారం.
విద్యుత్, మున్సిపల్ శాఖలకు లేఖ
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాలో రెగ్యులరైజేషన్ కోసం జీఓ 59 దరఖాస్తులతో పాటు జత చేసిన ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లుల్లో చాలావరకు నకిలీవని తేలింది. ఖాళీ జాగలకు ఇంటి పన్ను పత్రాలు, అసలు మీటర్ ఇవ్వకుండా బిల్లులను తయారు చేసి వాటిని రెవెన్యూ అధికారులకు సమర్పించినట్టు అధికారుల విచారణలో తేలింది. ఇలాంటి ఈ డాక్యుమెంట్లు చాలా ఉన్నట్టు తేలడంతో వాటిపై కూడా విద్యుత్, మున్సిపల్ శాఖలకు సమాచారం కోసం సిసిఎల్‌ఏ లేఖ రాసినట్టుగా తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News