Sunday, January 19, 2025

అమ్మను కలిసేందుకు కవితకు అనుమతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎ స్ ఎంఎల్‌సి కవిత, గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిష న్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలం టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత సుప్రీంను ఆశ్రయించారు. సిఆర్‌పిసి నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని, ఈ మేరకు ఇడిని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశా రు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయ వాదులు కోరగా, అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. మార్చి 24న విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పుడూ వాయిదా పడి, చివరకు 27న తొలిసారి ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ రిట్ పిటిషన్‌పై అప్పటికే ఇడి కెవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో రెండింటిపై సుప్రీం విచారించింది. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సంవత్సర కాలంగా కోర్టులో నలుగుతున్న ఈ పిటిషన్‌పై ఈ నెల 15న మరోమారు విచారించిన సుప్రీం, ఇరువురి తరఫు న్యాయవాదుల సుధీర్ఘ వాదనల అనంతరం మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం మరోసారి దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

అయితే ఈ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ కావడంతో ఈ రిట్ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని భావించిన ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పిటిషన్ ఉప సంహరణకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ బెంచ్ అనుమంతిచారని తెలిపారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితతో పాటు వైఎస్సార్‌సిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన బినామీలు అరుణ్ రామచంద్రపిళ్లై, ప్రేమ్ రాహుల్, సౌత్ గ్రూపు ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించి, మద్యం విధానాన్ని అనుకూలంగా మలచు న్నారని ఇడి అభియోగం మోపింది. దీనిపై గతేడాది మార్చి 11న తొలిసారి కవితను విచారించిన ఇడి అధికారులు, 16న మరో సారి హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈ సమన్లను సవాల్ చేస్తూ అదే నెల 14న కవిత సుప్రీంలో అత్యవసర విచారణ (రిట్) పిటిషన్ దాఖలు చేశారు.

అమ్మను కలిసేందుకు కవితకు అనుమతి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ఇడి కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మె ల్సీ కవిత ‘మా అమ్మను కలిసేందుకు అనుమతిం చండి’ అంటూ న్యాయస్థా నాన్ని అభ్యర్థించారు. తల్లితో పాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయ స్థానాన్ని కోరారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు లో కవిత తరపు న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కవి త అభ్యర్థనకు న్యాయస్థానం అంగీ కరించింది. తల్లి శోభ, కుమారులు ఆది త్య, ఆర్య, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిల ను కలుసుకునేందుకు న్యాయ స్థానాన్ని కవిత అనుమతి కోరారు. ఈ క్రమం లో తల్లీ, కుమారులు, కుటుంబసభ్యులను కలిసేందుకు కవితను న్యాయ స్థానం అనుమతిం చింది. కాగా ఇడి కస్టడీకి అనుమతించిన శనివారం రోజు భర్త అనిల్, సోదరుడు కెటిఆర్, బావ హరీశ్ రావు, కజిన్ బ్రదర్స్ పి శ్రీధర్, ప్రణీత్ కుమార్, పిఎ శరత్ చంద్రలను కలుసుకునేందుకు కోర్టు అంగీ కరించిన విషయం విదితమే. కస్టడీలో ఉన్న ఏడు రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బంధువులను కలుసుకు నేందుకు కవితకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్కువ మంది ని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని మంగళవారం కవిత తాజా పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ముం దుగా అనుమతించిన వారిలో కేటీఆర్ పేరుతో పాటు తల్లి, కుమారులు, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డి కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు వెల్లడించారు. దీంతో ఆ మేరకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News