Thursday, January 2, 2025

చేనులో ప్రియురాలు, మరో వ్యక్తిని హత్య చేసిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చేబ్రోలులో పెండ్యాల లోవమ్మ(35) అనే మహిళ భర్తను వదిలేసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. లోవమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. నాగబాబు అనే వ్యక్తి లోవమ్మతో సహజీవనం చేస్తున్నాడు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులతో అదే గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ మధ్యలో పోసిన శ్రీను(45) అనే వ్యక్తితో ఆమె చనువుగా ఉండడం అతడు గమనించాడు. లక్ష్మీపురం పంట పొలాల్లో శ్రీను, లోవమ్మ, ఆమె తల్లి రామలక్ష్మమ్మ పని చేస్తుండగా వారిపై నాగబాబు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో లోవమ్మ, శ్రీను ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. రామలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News