హైదరాబాద్ లో బిజెపికి మహబూబ్ నగర్ లో బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మహబూబ్ నగర్ జడ్పి చైర్మన్ గా ఆమె సేవలందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిజెపి నేత శ్రీగణేషన్ నారాయణన్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టకెట్ ఖాయంకావడంతో గణేశన్ బిజెపికి స్వస్థి పలికారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆధ్వరంలో మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిలు కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ స్థానం నుంచి ఆయన ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్నారు. ప్రజాబలం ఉన్న గణేశ్‌ను పార్టీలో చేర్చుకుంటే గెలుస్తామని కాంగ్రెస్ హైకమాండ్‌కు స్థానిక నాయకులు తెలియజేయడంతో వెంటనే ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లాస్యనందిత చనిపోవడంతో ఉప ఎన్నికల నిర్వహించాలని ఇసి నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి దివంగత గద్దర్ కూతురు వెన్నెల పోటీచేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మరో వైపు బిఆర్‌ఎస్ తరపున సాయన్న మరో కుమార్తె నివేదితకు టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు పట్టుబడుతున్నారు.
బిజెపి, బిఆర్ఎస్ కు బిగ్ షాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -