Saturday, December 21, 2024

నేడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులలో కూ డిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. పశ్చిమ విదర్భ , దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బుధవా రం ఉత్తర తెలంగాణ పరిసరాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది.

మరో వైపు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి పశ్చిమ విదర్భ వరకూ కొనసాగిన ద్రోణి గాలి విశ్చిన్నతి బుధవారం కేరళ నుండి ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24గంటల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని , శుక్రవారం నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News