Monday, December 23, 2024

భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి సిపిఎం పోటీ

- Advertisement -
- Advertisement -

భువనగిరి పార్లమెంట్ స్థానానికి జహంగీర్ పోటీ చేస్తారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య వెల్లడించారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలలో తమ పార్టీ ఒక స్థానంలో బరిలో ఉంటామని వెల్లడించారు. మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏ పార్టీకి మద్దతు ఇవ్వా లని లోతుగా చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఇప్పటికైతే తాము బిజెపి పార్టీని ఓడించేందుకు ఇండియా కూటమిలోని ఉన్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కులాల పేరిట ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు సరైన విధానం కాదని తప్పుబట్టారు. ఎస్‌సి, ఎస్‌టిలకు అణగారిన వర్గాలు అన్నిటా వెనుకబడినందున వారికీ మొదటి నుండి కార్పొరేషన్‌లు ఉన్నాయని గుర్తు చేసారు.

చేతి వృత్తాల వారికీ కార్పొరేషన్ ఉండటం వల్ల వారికీ సహాయం అందుతుందని, కానీ ఎలాంటి కుల వృత్తి లేని వారికీ, కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమంటే కులాలను సంతృప్తి పర్చడానికేనని విమర్శించారు. ధరణి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. పెండింగ్ స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని అన్నారు . ఇందిరమ్మ ఇండ్ల కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మూసీ నదిని ముందుగా శుద్ధీకరించి, ఆ తర్వాత సుందరీకరణ పనులు చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, టి జ్యోతి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఎండి జహంగీర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News