- Advertisement -
హైదరాబాద్: ఎలక్టోరల్ బాండ్లు తీవ్రమైన అంశమని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. గురువారం సోనియా మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్‌ను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే కుట్ర కనిపిస్తోందని, కేంద్రం తీరు సరిగా లేదని, కాంగ్రెస్ అకౌంట్లపై ప్రీజ్ తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ అకౌంట్లపై ముప్పేట దాడి జరుగుతోందని, అకౌంట్లను ప్రీజ్ చేయడమనేది దారుణమైన విషయమని సోనియా గాంధీ మండిపడ్డారు. నిధుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సోనియా ఆగ్రహంవ్యక్తం చేశారు.
- Advertisement -