Monday, December 23, 2024

బిజెపి మూడో జాబితా విడుదల.. బరిలో తమిళిసై

- Advertisement -
- Advertisement -

దేశంలో లోక్ సభ ఎన్నికల హాడవిడి కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రాష్ట్రాల వారిగా బిజెపి ప్రకటిసోంది. తాజాగా తమిళనాడు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల మూడో జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. తొమ్మిది మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీ చేయనున్నారు. కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్‌ బరిలోకి దిగనున్నారు.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News