Friday, December 20, 2024

ఎంఎల్‌సి కవితపై ఐదో రోజు ఇడి ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎంల్‌సి కవితపై 5వ రోజైన గురువారం ఇడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్రపై అధికారులు ఆరా తీశారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ప్రశ్నించారు. మనీశ్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా కేసులో నిందితులు ఇచ్చిన వాంగూల్మాల ఆధారంగా కవితను ప్రశ్నించారు. రోజుకు దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ప్రశ్నిస్తున్న ఇడి లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు రాబడు తున్నట్లు తెలిసింది.

బుధవారం కవిత పిఎలు రాజేశ్, రోహిత్ లను ప్రశ్నించిన ఇడి అధికారులు కవిత అరెస్ట్ సమయంలో సీజ్ చేసిన ఫోన్లలో ఉన్న సమాచారంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇడి కస్టడీలో రోజూ కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. కవిత ఇడి కార్యాలయంలోని క్యాంటీన్ భోజనమే తింటున్నట్లు సమాచారం. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్-19 కింద కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వుల మేరకు కవిత వారం రోజుల ఇడి కస్టడీలో ఉన్నారు. కవిత నుంచి అనేక సమాచారం సేకరించాల్సి ఉంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్ తో ఉన్న ఒప్పందాలు, సౌత్ గ్రూప్ పాత్రకు సంబంధించిన అంశాలపైన కవితను ప్రశ్నించాల్సి ఉంది. గతంలో కవిత అనేక ఆధారాలను నాశనం చేశారని, ఫోన్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారని, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పుడు సమాచారం ఇచ్చారని ఇడి అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇడి వద్ద ఉన్న ఆధారాలకు అనుగుణంగా కోర్టు కవిత కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం 5వ రోజు కవితను ఈడీ అధికారులు విచారించారు.

రంగంలోకి కెసిఆర్!
కెసిఆర్ సైతం రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వి, విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీతో కవిత ఇడి కస్టడీ ముగియ నుంది. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భంగా కవితను ఏయే ప్రశ్నలు అడిగారు, కవిత కేసు దర్యాఫ్తునకు సహకరించారా? లేదా? అన్నది కోర్టుకు ఇడి తెలిపే అవకాశం ఉంది. మార్చి 23వ తేదీతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది. కస్టడీలో కవిత తమకు సహకరించారని ఇడి అధికారులు చెబితే ఇక్కడితో ఇడి కస్టడీ ముగుస్తుంది. తదుపరి న్యాయపోరాటానికి సంబంధించి ఏం జరగనుంది? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కస్టడీలో కవిత తమకు సహకరించలేదని ఇడి అధికారులు కనుక కోర్టుకు చెబితే మాత్రం కస్టడీని పొడిగించే అవకాశాలు న్నాయని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News