- Advertisement -
జైపూర్: గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జస్లా గ్రామంలో ఓ మహిళ తన వంటి గదిలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై పేలింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. గ్రామస్థుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మృతులలో ముగ్గురు మైనర్లు ఉన్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర శర్మ పేర్కొన్నారు.
- Advertisement -