Friday, December 20, 2024

కేజ్రీవాల్‌కు కాసేపట్లో వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల కోసం ఇడి హెడ్‌క్వార్టర్స్‌కు వైద్య బృందం చేరుకుంది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఆప్ పిలుపునిచ్చింది. ఆమ్‌ఆద్మీ పార్టీ పిలుపు దృష్టా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం రాత్రి కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో సిఎం కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు ఇడి సమన్లు జారీ చేసింది.

ఇడి సమన్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ చాలా రోజుల నుంచి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చడంతో విచారణను ఏప్రిల్ 22కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటలోనే కేజ్రీవాల్ ఇంటికి ఇడి వెళ్లింది. సెర్చ్ వారెంట్‌తో వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు చేసి కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసింది. ఢిల్లీ మధ్యం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఇడి అరెస్టు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News