Friday, December 20, 2024

బెయిల్ పై సుప్రీంకోర్టులో కవితకు లభించని ఊరట

- Advertisement -
- Advertisement -

లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన బిఆర్ఎస్ నాయకురాలు కవితకు సాంత్వన లభించలేదు. బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. లిక్కర్ కుంభకోణం కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లదలచుకోలేదని, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచించింది.

అంతకుముందు కవిత తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబ్బల్ వాదిస్తూ లిక్కర్ కేసులో తన క్లయింట్ ను ఒకసారి సాక్షిగా, మరొకసారి నిందితురాలిగా ఈడి పిలిచిందని, ఈ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు కలవరం కలిగిస్తున్నాయని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యమూ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News