Monday, December 23, 2024

సముద్రగర్భంలో భూకంపం

- Advertisement -
- Advertisement -

జకార్తా: ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో శుక్రవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. సముద్రగర్భంలో భూకంపం జకార్తా కాలమానం ప్రకారం ఉదయం 11.22 గంటలకు సంభవించినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం టుబాన్ రీజెన్సీకి ఈశాన్యంగా 132 కిమీ దూరంలో, 10 కిమీ లోతులో ఉందని ఏజెన్సీ తెలిపింది. ప్రకంపనల వల్ల భారీ అలలు ఎగసిపడే అవకాశం లేనందున ఏజన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News