Monday, December 23, 2024

ఐ ఫోన్ పై అమెరికా కోపం.. ఆపిల్ పై కేసు

- Advertisement -
- Advertisement -

స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆపిల్ సంస్థపై అమెరికా కేసు పెట్టింది. పోటీకి తావులేకుండా, ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తూ, వినియోగదారులపై ఆపిల్ సంస్థ అధిక ధరల భారం మోపుతోందని ఆరోపించింది. ఐ ఫోన్ పేరిట చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నందుకు ఆపిల్ పై అమెరికా న్యాయ శాఖ దావా వేసింది. ఐ ఫోన్ లోని ఫీచర్లవల్ల వినియోగదారులు ఇతర చౌకైన స్మార్ట్ ఫోన్ల వైపు పోవడం లేదు. ధర ఎక్కువైనా ఐఫోన్లే వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆపిల్ వందల బిలియన్ డాలర్లను కొల్లగొట్టిందని ఆరోపిస్తూ అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కేసులో చేరాయి.

1976లో స్టీవ్ జాబ్స్ స్థాపించిన ఆపిల్ సంస్థ తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమేణా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ సంస్థ గుత్తాధిపత్యంపై దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్ యాజమాన్య సంస్థ మెటా సంస్థలు అమెరికాలో యాంటీ ట్రస్ట్ కేసులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఆపిల్ కూడా వాటి సరసన చేరింది. ఈ కేసు దాఖలైన వెంటనే వాల్ స్ట్రీట్ లో ఆపిల్ సంస్థ షేర్లు 3.75 శాతం పతనమయ్యాయి.

అమెరికాలో 13కోట్ల 60 లక్షల ఐఫోన్ వినియోగదారులను చేరుకోవాలనుకునే సంస్థలు, డెవలపర్లకు ఆపిల్ కఠినమైన షరతులు విధించేది. వాటివల్లే పరిస్థితి ఈ కేసులకు దారితీసింది. ఆపిల్, ఇతర కంపెనీలు యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తున్నందున వినియోగదారులు అధిక ధరలను చెల్లించాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ అన్నారు. ఈ గుత్తాధిపత్య ధోరణులకు అడ్డుకట్ట వేయని పక్షంలో, ఆపిల్ తన స్మార్ట్ ఫోన్ గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News