Wednesday, January 22, 2025

బిజెపికి బీటీమ్ లీడర్ గా రేవంత్ రెడ్డి తీరు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కాంగ్రెస్ హైకమాండ్ ది ఒకదారి.. రేవంత్ ది మరోదారి అన్నట్లు ఉందని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు బిజెపికి బీ టీమ్ గా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేయడం లేదని, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News