Friday, December 20, 2024

కుమార్తె కిడ్నీ తీసుకుని టిక్కెట్ ఇచ్చారు

- Advertisement -
- Advertisement -

ఆర్‌జెడి సుప్రీమో లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యర్థులకు లోక్‌సభ ఎన్నికలకు ‘టిక్కెట్లను అమ్ముకున్నారు’ అని బీహార్ బిజెపి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి శుక్రవారం ఆరోపించారు. లాలూ తన కుమార్తెను కూడా వదలలేదని, ఆమెను అభ్యర్థిని చేసే ముందు ఆమె దగ్గర నుంచి కిడ్నీ తీసుకున్నారని చౌదరి ఆరోపించారు. లాలూ కుమార్తె, సింగపూర్ నివాసంగా గల రోహిణీ ఆచార్య ఆయన ఆరోపణను తీవ్రంగా ఖండించింది. ‘అటువంటి సంకుచిత భావాల’ వ్యక్తులకు ప్రజల కోర్టులో సమాధానం ఇస్తానని రోహిణి తెలిపారు. అస్వస్థతతో బాధ పడుతున్న లాలూకు 2022 ద్వితీయార్ధంలో తన కిడ్నీలలో ఒకదానిని రోహిణి దానం చేశారు.

ఎన్నికల రాజకీయాలలో అరంగేట్రం చేస్తున్న రోహిణీ ఆచార్య ఆర్‌జెడి టిక్కెట్‌పై బీహార్ సరణ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. సామ్రాట్ చౌదరి పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ, ‘టిక్కెట్ల అమ్మకంలో నిపుణుడైన రాజకీయ నేత లాలూ ప్రసాద్.ఆయన తన కుమార్తెను కూడా వదలలేదు. మొదట ఆయన ఆమె దగ్గర నుంచి కిడ్నీ తీసుకున్నారు. ఇప్పుడు ఆమెకు లోక్‌సభకు టిక్కెట్ ఇచ్చారు’ అని ఆరోపించారు. చౌదరి వ్యాఖ్యకు రోహిణి స్పందిస్తూ, ఎవరిది సరైనదో, ఎవరిది తప్పో ప్రజలే నిర్ణయిస్తారు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News