Saturday, December 21, 2024

నేడు పంజాబ్‌తో ఢిల్లీ పోరు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఐపిఎల్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. పంజాబ్‌కు శిఖర్ ధావన్, ఢిల్లీకి రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత రిషబ్ పంత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు పంజాబ్ అటు ఢిల్లీ మొదటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు.

ధావన్, సికందర్ రజా, సామ్ కరన్, జానీ బెయిర్‌స్టో, రబడా, లివింగ్‌స్టోన్, రొసొ, అర్ష్‌దీప్ సిగ్, వోక్స్ వంటి స్టార్ ఆటగాళ్లు పంజాబ్‌లో ఉన్నారు. బెయిర్‌స్టో, రొసొ, కరన్‌లపై పంజాబ్ భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ ధావన్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. మరోవైపు ఢిల్లీలోనూ వార్నర్, షాయ్ హోప్, మిఛెల్ మార్ష్, పృథ్వీషా, నోర్జే వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పైనే నిలిచింది. అతను జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News