Friday, December 20, 2024

రెవెన్యూ అధికారుల మోసం…. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: తమ భూమి రికార్డులు వేరే వాళ్ల పేర్ల మీద ఉండడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్త మాధవరంలో సుబ్బారావు(47), పద్మావతి(41) అనే దంపతులు చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె వినయ(17) ఉంది. సుబ్బారావు పేరు మీద మూడెకరాల పొలం ఉంది, ఆ పొలం అమ్ముదామనుకొని ఎంఆర్‌ఒ ఆఫీస్‌కు వెళ్లాడు. భూమి తన పేరు మీద లేకపోవడంతో మస్థాపానికి గురయ్యాడు. ఒంటిమిట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్య పద్మావతి, వినయ ఆత్మహత్య చేసుకున్నారు. సిఐ పురుషోత్తమ రాజు ఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాము అమ్ముదామనుకున్నాం పొలం వేరే పేర్లతో రికార్డులో ఉందని, తమని రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమి చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోటల్ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News