Saturday, December 21, 2024

మరో మూడు రోజులు ఇడి కస్టడీలో కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వారం రోజులుగా ఎంఎల్‌సి కవితను విచారిస్తున్నామని, కానీ ఆమె సహకరించడంలేదని రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఇడి తరపు న్యాయవాది తెలిపారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఇడి హాజరుపరిచింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత కేసులో ఇడి వాదనలు వినిపించింది. ఈ రోజులతో ఆమె ఏడు రోజుల కస్టడీ ముగియనుండడంతో మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇడి కోర్టును కోరింది. దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ తీసుకోమ్మని ఇడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కొందరితో కలిసి కవితను విచారించాల్సి ఉందని, కుటుంబ వ్యాపార లావాదేవీలపై విచారణ చేయాల్సి ఉందని, కానీ కవిత కుటుంబ సభ్యులు కూడా సహకరించడంలేదని, సమీర్ మహేంద్రను విచారించాల్సి ఉందన్నారు. కవిత తన ఫొన్ డేటాను డిలీట్ చేశారని ఇడి తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆమెకు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్ని అందిస్తున్నామని వివరించారు. కవిత తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇడికి నోటీసులు ఇవ్వాలని న్యాయవాది కోర్టును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News