- Advertisement -
హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని ఛత్రినాక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాతబస్తీ పరిధి ఉప్పుగూడలో డ్రగ్స్ అమ్ముతున్న ఆశిష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 19 గ్రాముల ఎండిఎంఏ, 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది.
- Advertisement -