Friday, December 20, 2024

కేజ్రీవాల్ అరెస్టు ఓ విడ్డూరం: అన్నా హజారే

- Advertisement -
- Advertisement -

జన్ లోక్‌పాల్ ఉద్యమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతి కేసులో అరెస్టు కావడం విడ్డూరంగా ఉందని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండు చేశారు. కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని కేజ్రీవాల్ కమ్ముచేశారని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. రాజకీయ ఆకాంక్షలే 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కవాడం తనను ఎతంగానో బాధించిందని హజారే తెలిపారు. అవినీతి అంతమే లక్షంగా చేపట్టిన జన్ లోక్‌పాల్ ఉద్యమంలో తన సహచరుడు ఇలా అవినీతి కేసులో అరెస్టు కావడం వింతగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జన్ లోక్‌సాల్ ఏర్పాటు కోసం మొదలైన ఉద్యమం గత దశాబ్దం ప్రారంభంలో అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వాన్ని వణికించింది.

ఆ ఉద్యమం నుంచే అన్నా హజారే, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కీలక నాయకులుగా ఆవిర్భవించారు. ఆనంతర కాలంలో కేజ్రీవాల్ సిసోడియాతో కలసి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. కాని ఆ ఉద్యమం రాజకీయ మలుపు తిరగడంతో హజారే దానికి దూరం జరిగిపోయారు. జన్ లోక్‌పాల్ ఉద్యమానికి రాజకీయ ప్రత్యామ్నాయం విఫలం కావడం దురదృష్టకరమని, రాజకీయ ఆకాంక్షల కారణంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం నాశనమైందని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి హజారే విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది భారతీయులకు కేజ్రీవాల్ నమ్మకద్రోహం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ ఎకైజ్ పాలసీపై 2022 ఆగస్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు తాను రాసిన లేఖను హజారే ప్రస్తావించారు. తన పుస్తకం స్వరాజ్‌లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్ రాసిన నైతిక సూత్రాలను తన లేఖలో హజారే ప్రస్తావించారు. ఈ అవినీతి వ్యవహారం తనను దిగ్భ్రాంతికి లోను చేసిందని ఆయన చెప్పారు. ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని హజారే కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News