Sunday, December 22, 2024

ఎఐసిఎంఎ అధ్యక్షుడుగా ఆదిత్య ముంజల్

- Advertisement -
- Advertisement -

భారత్‌లో సైకిల్ తయారీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ సంస్థ అఖిల భారత సైకిల్ తయారీదారుల సంఘం (ఎఐసిఎంఎ) 2024, 2026 కాలానికి తమ అధ్యక్షుడుగా హీరో సైకిల్స్ సిఇఒ ఆదిత్య ముంజల్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. తన అధ్యక్ష పదవీ కాలంలో ఆదిత్య ముంజల్ సైకిళ్లు, ఇ సైకిళ్లు ఎగుమతికి ప్రధాన కేంద్రంగా భారత్‌ను నిలబెట్టడం లక్షంగా పరిశ్రమ, విధాన భాగస్వాములతో కలసి కృషి చేస్తారు. హీరో సైకిల్స్ భారత్‌లో అతిపెద్ద సైకిళ్ల ఉత్పత్తి సంస్థ. దేశంలో సైకిళ్ల మార్కెట్‌లో సంస్థ అగ్ర స్థానంలో ఉన్నది.

ఎఐసిఎంఎ అధ్యక్షుడుగా, దూరదృష్టి గల వాణిజ్య నేతగా ఆదిత్య ముంజల్ ప్రపంచ ప్రమాణాలతో సమానంగా దేశంలో సైకిళ్ల తయారీ ప్రమాణాన్ని పెంచడం లక్షంగా పెట్టుకున్నారు. సైకిళ్ల నాణ్యతలో ఈ మెరుగుదల ఇతర ఆసియా దేశాలతో పోటీ పడేందుకు భారతీయ ఉత్పత్తి సంస్థలు, వాటి అనుబంధ పరిశ్రమలకు ఎగుమతి అవకాశాలను పెంచగలదు. తన నూతన బాధ్యతపై ఆదిత్య ముంజల్ మాట్లాడుతూ, భారత అపెక్స్ సైకిల్ తయారీదారుల పరిశ్రమ సంస్థ ఎఐసిఎంఎ అధ్యక్షుడుగా నియుక్తుడిని కావడం గర్వకారణమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News