- Advertisement -
ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అడవుల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పొరుగున ఉన్న సుకుమా జిల్లాలో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పిడియా గ్రామం సమీపాన భద్రతా దళాలు
అడవీ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయడంతో రెండు వైపులా ఎదురెదురు కాల్పులు చోటు చేసుకున్నాయని ఐజీ సుందర్ రాజ్ చెప్పారు . కాల్పులు ముగిసిన తరువాత ఇద్దరు నక్సల్స్ మృతదేహాలను, ఆయుధాలను ఆ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరి నక్సల్స్‌ను గుర్తించ వలసి ఉందని ఐజీ చెప్పారు. ఇదే ఆపరేషన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి దంతేవాడ సుక్మా సరిహద్దులో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
- Advertisement -