- Advertisement -
తిరుమల తిరుపతి దేశస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టిటిడి పేర్కొంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి ఆళ్వార్ ట్యాంకు అతిధి గృహం వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న 72,986 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,482 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న రూ.2.97 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల అధికారులు తెలిపారు. వరస సెలవు దినాలు కావడంతో తిరుమల వెంకన్న ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు.
- Advertisement -