Monday, November 25, 2024

డబుల్ రేస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఆయా పార్టీల నాయకత్వం పూర్తిగా పార్లమెంటు ఎన్నికలపైనే దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండంకెల స్థానాలు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ పోరులో అ ధిక సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలని కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో తి రిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బి జెపి డబుల్ డిజిట్ సీట్లు సాధించేందుకు కసరత్తు లు చేస్తుండగా, ఈ ఎన్నికల్లో గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సాధించి తమ సత్తా చాటుకునేందుకు బిఆర్‌ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.

కాంగ్రెస్, బిజెపి పార్టీలు వలసలపై దృష్టి సారి స్తూ బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆ హ్వానించి సీట్లు ఇస్తుండగా, బిఆర్‌ఎస్ పార్టీ బ హుజన వాదంతో తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో రెండంకెల సీ ట్లు గెలిచేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోం ది. లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు దక్కించుకోవడమే లక్షంగా ప్రత్యర్థి పార్టీల ఆలోచనలకు అనుగుణంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు వలసలపై దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో బలాన్ని పెం చుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి.

పార్టీలతో కొత్త, పాత నేతల కలయిక
ప్రధాన పార్టీలు ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అ భ్యర్థులను ప్రకటించగా, త్వరలోనే మిగిలిన స్థా నాలకు అభ్యర్థులను ప్రకటించనున్నాయి. సీనియర్లు, కొత్త అభ్యర్థులు అనే తేడా లేకుండా పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థు ల కోసం ఆయా పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ఇత ర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను గుర్తిం చి వారికి తమ పార్టీలోకి ఆహ్వానించి వెంటనే టి కెట్లు కేటాయిస్తున్నారు. ఒకవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన… మరొకవైపు నాయకులు భే టీలు, చేరికలతో రాజకీయ పరిణామాలు రాష్ట్రం లో శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. మొత్తం 17 స్థానాలకు కనీసం 14 స్థానాలైన చేజిక్కించుకోవాలని చూస్తోంది.

బలమైన నాయకత్వం లేని చోట పార్టీని బలోపేతం చేసే దిశలో ఎఐసిసి అనుమతితో పక్కా కార్యాచరణ అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఈ నెలాఖరులోగా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీ గెలుపునకు కృషి చేయాలని క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే దిశలో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.రాష్ట్ర ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డినే స్వయంగా నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి నియోజక వర్గ నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. లోకసభ ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో పాలనాపరమైన అంశాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర అసంతృప్తి నాయకులతో మంతనాలు జరుపుతూ వారిని హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేసినప్పుడు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రాష్ట్రమంతటా అమలు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

బూత్ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన పార్టీ ముఖ్యనేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పనితీరు ఆధారంగా త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పర్యవేక్షించే బాధ్యతలను నిర్వహించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సిఎం ప్రకటించారు.

డబుల్ డిజిట్ సాధించేలా బిజెపి వ్యూహాలు
తెలంగాణలో బిజెపికి సానుకూల వాతావరణం ఉందని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ డబుల్ డిజిట్ సాధిస్తుందని బిజెపి రాష్ట్ర నాయకత్వం ధీమాగా ఉంది. కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బిజెపి ఈ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆదివారం నాటితో బిజెపి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టికెట్లు పొందిన అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాలలో ప్రచారం ముమ్మరం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహాలపై అభ్యర్థులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బిజెపి పార్టీకి అండగా ఉండటానికి తెలంగాణ మహిళలు స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారని, మోదీ తిరిగి ప్రధాని కావాలని అంటున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దేశానికి దేశ భవిష్యత్‌కు సంబంధించినవి అని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలని, ఏ పోలింగ్ బూత్‌కు ఆ పోలింగ్ బూత్ వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు కిషన్‌రెడ్డి సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గెలవాలని, ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక ముఖ్య నేతను సమన్వయ కర్తగా నియమించాలని ఆదేశించారు. తాను కూడా ఒక పోలింగ్ కేంద్రానికి కో ఆర్డినేటర్‌గా ఉంటానని తెలిపారు.

అత్యధిక స్థానాలలో గెలుపుపై బిఆర్‌ఎస్ ధీమా
లోక్‌సభ ఎన్నికల్తో సత్తా చాటేందుకు బిఆర్‌ఎస్ పార్టీ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటివరకు 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ, త్వరలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నది. పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో బిఆర్‌ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు సీట్లు కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎస్‌సి, ఎస్‌టి రిజర్వుడ్ స్థానాలలో సైతం ఆయా వర్గాలలోని వివిధ కులాల అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల ప్రణాళికలపై అధినేత కెసిఆర్ దృష్టి సారించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పార్టీ అన్ని వర్గాలకు దగ్గర చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.

కొంతమంది నాయకులు పార్టీ మారినా తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని, బిఆర్‌ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు పొందిన లబ్దిదారులు, గ్రామస్థాయి నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని బిఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పనిచేసినప్పటికీ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహం పనిచేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను బిఆర్‌ఎస్ అధినాయకత్వం సమాయత్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News