Monday, January 20, 2025

డీజిల్ దందా

- Advertisement -
- Advertisement -

డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ మాదాపూర్ ఎస్‌ఓటి, గచ్చిబౌలి పోలీసులకు కలిసి పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.14,36,250 విలువైన 15,000లీటర్ల డీ జిల్, నాలుగు ట్యాంకర్లు, రెండు డీజిల్ మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకా రం…కర్నాటక రాష్ట్రం, చించోలికి చెందిన సద్దాం డ్రై వర్, సంగారెడ్డి జిల్లాకు చెందిన మిర్సా ఇస్మాయిల్ బే గ్, సయ్యద్ గౌస్ ట్యాంకర్ యజమాని, స్థానిక డ్రైవ ర్లు శంకర్, రాధాకృష్ణ, మెదక్ జిల్లా, అల్లాదుర్గం మండలం, ముప్పారం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్, బౌరంపేటకు చెందిన నరేష్ గౌడ్, మెదక్ జిల్లా, టేక్మల్ మండలం, ధన్నారం గ్రామానికి చెంది న పాకిరి ఇస్మాయిల్, సంగారెడ్డి జహీరాబాద్‌కు చెం దిన బొబ్బిలి సిద్దప్ప, రామకృష్ణ కలిసి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్నారు.

కర్నాటక రాష్ట్రంలోని చించోలిలో డీజిల్‌ను రూ.85.75 కొనుగోలు చేసి తెలంగాణలో రూ.92 నుంచి 94లకు విక్రయిస్తున్నారు. కర్నాటకలో డీజిల్ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని వట్టినాగులపల్లి, కోకాపేట తదితర ప్రాంతాల్లోని భవన నిర్మాణాలకు, క్రషర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.ఈ విషయం తెలియడంతో పోలీసులు నిఘా పెట్టి గచ్చిబౌలిలోని శంకర్‌హిల్ ప్రాంతంలో పెద్ద ట్యాంకర్ నుంచి చిన్న ట్యాంకర్‌లోకి డీజిల్ మార్చుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం భయటపడింది. నిందితులు నాలుగు ట్యాంకర్ల ద్వారా డీజిల్ తీసుకుని వస్తున్నట్లు తెలిసింది. కేసును తెలంగాణ సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News