Friday, December 20, 2024

ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల..ఉప్పల్ లో 7మ్యాచ్ లు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల
మే 21న తొలి క్వాలిఫయర్, 22న ఎలిమినేటర్
రెండు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోనే..
మే 26న చెన్నైలో ఫైనల్ సమరం

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2024కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సోమవారం ప్రకటించింది. శుక్రవారం ప్రారంభమైన ఐపిఎల్ సీజన్ 17 మే 26న చెన్నైలో జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి క్వాలిఫయర్ 21న, ఎలిమినేటర్ పోరు 22న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. రెండో క్వాలిఫయర్ మే 24న చెన్నైలో నిర్వహిస్తారు. ఫైనల్ కూడా చెన్నైలోనే జరుగనుంది. కాగా లీగ్ దశ మ్యాచ్‌లకు మే 19న తెరపడనుంది. కాగా, ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి విడత షెడ్యూల్‌లో రెండు మ్యాచ్‌లకు దక్కగా ఈసారి మరో ఐదు మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం దక్కింది. రెండో విడతలో విశాఖపట్నంకు నిరాశే మిగిలింది.

రెండో ఫేజ్‌లో విశాఖపట్నంకు ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు. తొలి ఫేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తోంది. రెండో ఫేజ్‌లో గౌహతి, ధర్మశాల, మొహాలీ, ఢిల్లీ నగరాలకు మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం దక్కింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మే ఐదున చెన్నైతో, 9న బెంగళూరుతో పంజాబ్ తలపడనుంది. గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. మే 15న పంజాబ్‌తో, 19న కోల్‌కతాతో రాజస్థాన్ తలపడుతుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తన మిగిలిన ఐదు లీగ్ మ్యాచ్‌లను సొంత గ్రౌండ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

హైదరాబాద్‌లో ఏడు మ్యాచ్‌లు..
ఐపిఎల్‌లో ఈసారి మొత్తం ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లను జరుగనున్నాయి. తొలి ఫేజ్‌లో రెండు మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం హైదరాబాద్‌కు దక్కింది. రెండో విడతలో మరో ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే ఛాన్స్ లభించింది. మార్చి 27న హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ ఐదున చెన్నైతో, మూడో మ్యాచ్ ఏప్రిల్ 25న బెంగళూరుతో జరుగనుంది. ఇక మే రెండున రాజస్థాన్‌తో, 8న లక్నోతో, 16న గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌ను మే 19న పంజాబ్‌తో హైదరాబాద్ ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News