Friday, January 3, 2025

హీరోగా ఎన్టీఆర్ మునిమనవడి ఎంట్రీ!

- Advertisement -
- Advertisement -

తెలుగు తెరకూ, ఎన్టీఆర్ వంశానికీ అవినాభావ సంబంధం ఉంది. నందమూరి కుటుంబంనుంచి ప్రతి తరంలోనూ ఇద్దరు ముగ్గురు నటులు అభిమానులను అలరించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా తరతరాలుగా ఈ కుటుంబానికి చెందిన నటులు రాణిస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ వంశంలో నాలుగో తరం నటుడు తెరంగేట్రం చేయబోతున్నాడు! అతను మరెవరో కాదు… హరికృష్ణ మనవడు, ఎన్టీఆర్ ముని మనవడు అయిన తారకరామారావు! ఇతను హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ కుమారుడు. జానకీరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

తారకరామారావు సినిమాకు దర్శకత్వం వహించేది కూడా ఎన్టీఆర్ వీరాభిమానే కావడం విశేషం. ఆయనే ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి. హరికృష్ణతో సినిమాలు తీసిన చౌదరి తొమ్మిదేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. చివరిగా ‘రేయ్’ మూవీకి దర్శకత్వం వహించిన చౌదరి, అది ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత దర్శకత్వం జోలికి పోలేదు. ఎన్టీఆర్ ముని మనవడి అరంగేట్రం మూవీకి వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తారన్నది తాజా సమాచారం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News