Saturday, December 21, 2024

తుక్కుగూడ నుంచి శంఖారావం పూరిస్తాం : రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేక 7న కాంగ్రెస్ జాతీయస్థాయి సభ

జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన

లోక్ సభ ఎన్నికలు 100 రోజుల పాలనకు రెఫరెండం

హైదరాబాద్: తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేక 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందన్నారు.  కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారెంటీల ప్రకటన ఉంటుందన్నారు.

తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి గ్యారెంటీల ప్రకటన ఉంటుందన్నారు. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకోవాలని, తమ 100 రోజుల పాలన ఈ ఎన్నికలకు రెఫరెండం అని అన్నారు.

ప్రధాని మోడీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేశారో తెలుపాలన్నారు. గుజరాత్ కు బుల్లెట్ రైలు తీసుకెళుతున్న మోడీ వికారాబాద్ కు కనీసం ఎంఎంటిఎస్ తీసుకురాలేదని విమర్శించారు. ఏమి చూసి మోడీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News