Monday, January 20, 2025

రేవంత్, నీ బెదిరింపులకు బెదిరిపోం: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తప్పు జరిగితే విచారణ చెయ్యి… తప్పు చేసినవారి పేర్లు బయటపెట్టు..వారిపై చర్యలు తీసుకో, అంతే తప్ప బెదిరిస్తే బెదిరేందుకు ఇక్కడ ఎవరూ లేరు’ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో కాంగ్రెస్ కు 40కి మించి లోక్ సభ స్థానాలు వచ్చే అవకాశం లేదని, ఆ తర్వాత వెంటనే పార్టీనుంచి జంప్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డేనని కావాలంటే రాసి పెట్టుకోవచ్చునని కేటీఆర్ అన్నారు. రేవంత్ బీజేపీలోకి పోతాడని అంటున్నా ఖండించట్లేదని, జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పడం లేదని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం మాని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అందరినీ పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News