Friday, December 20, 2024

అటువంటి భాషకు తావే లేదు

- Advertisement -
- Advertisement -

శ్రీనాతే వివరించారు
కంగనా వ్యాఖ్యలపై వివాదానికి కాంగ్రెస్ స్పందన

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే సోషల్ మీడియా విభాగంలో కంగనా రనౌత్‌పై పోస్ట్ అయిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదం రేగిన నేపథ్యంలో కాంగ్రెస్ మంగళవారం స్పందిస్తూ, సార్వత్రిక చర్చలో అటువంటి భాషకు తావే లేదని తాను ఎల్లప్పుడూ విశ్వసిస్తుంటానని, శ్రీనాతే వివరణతో ఈ వివాదం అంతం కావాలని పేర్కొన్నది. తన అకౌంట్‌ను ఉపయోగించిన వేరొకరు ఆ పోస్ట్ చేసినట్లు శ్రీనాతే ఇప్పటికే వివరించారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ విలేకరుల గోష్ఠిలో తెలిపారు. ‘ఆ పని ఎవరు చేశారో తాను కనుక్కుంటానని ఆమె చెప్పారు’ అని దీక్షిత్ తెలిపారు. ‘సార్వత్రిక చర్చలో అటువంటి భాషకు తావే లేదు. ఆ విషయంలో కాంగ్రెస్‌ది ఎల్లప్పుడూ స్పష్టమైన వైఖరే. ఆ పని ఎవరు చేసినా అది తప్పేనని సుప్రియా జీ చెప్పారు. ఆమె వివరించారు. ఈ వ్యవహారం ఇంతటితో ముగియాలి’ అని దీక్షిత్ అన్నారు. కంగనా రనౌత్, మండిపైన కించపరిచే వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు శ్రీనాతే, హెచ్‌ఎస్ ఆహిర్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ అయిన తరువాత పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News