Friday, December 27, 2024

అమెరికాలో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిన వంతెన

- Advertisement -
- Advertisement -

నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది

నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జి
అందులో 22 మంది భారతీయ సిబ్బంది
వాషింగ్టన్ : అమెరికాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ కంటైనర్ షిప్ ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు సాధ్యం కాదని డ్రైవర్లకు సూచించింది. ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న అనేక వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. దాదాపు 20 మంది గల్లంతైనట్టు సమాచారం. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. చైనాలో ఇదే విధంగా గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఉన్న లిజింగ్షా వంతెనను ఓ నౌక బలంగా ఢీకొనగా ఒక బస్సుతోసహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురి ఆచూకీ గల్లంతయింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దర్యాప్తునకు అందరూ సహకరి స్తున్నారని అమెరికా అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News