Friday, December 20, 2024

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎదరుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ తో సహా ఆరుగురు మృతి చెందినట్లు ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు తెలిపారు. సంఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News