Saturday, December 21, 2024

బిజెపి ఉపాధి కల్పించలేదని యువతకు అర్థమైంది: ప్రియాంక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉపాధి కల్పనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉపాధి కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ విడుదల చేసిన 2024 నివేదికను ఉటంకించారు. భారత దేశం నిరుద్యోగులలో 83 శాతం మంది యువతే అని ప్రియాంక గాంధీ ఉటంకించారు. ‘‘ 2000లో నిరుద్యోగులలో విద్యావంతులైన నిరుద్యోగులు 35.2 శాతం కాగా, ఇప్పుడది రెట్టింపై 65.7 శాతంగా ఉందని’’ అన్నారు.

ప్రధాన మంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు ‘‘ నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదు’’ అన్నారని కాంగ్రెస్ పధాన కార్యదర్శి ప్రియాంక తెలిపారు. ఇదే బిజెపి అసలు రంగు అని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో కాంగ్రెస్ కు ఖచ్చితమైన ప్రణాళిక ఉందన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News