Monday, December 23, 2024

రేపు సిరిసిల్లాలో కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

గురువారం రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే  కేటీఆర్  సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు . గురువారం ఉదయం  ముస్తాబాద్ మండలం బందనకల్ లో జాకీర్ అనే నిరుపేద గృహప్రవేశానికి హాజరు కానున్నారు. అనంతరం గన్నవారిపల్లె లో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటల పరిశీలించనున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల అకాల వర్షానికి విద్యుత్ స్థంభం విరిగిపడి చనిపోయిన ఎల్సాని ఎల్లయ్య, అలాగే నష్టపోయిన హోటల్ యజమాని రవి కుటుంబాలకు పరామర్శించిస్తారు.ఆ తర్వాత సిరిసిల్ల పట్టణం షాదీఖానాలో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News