Saturday, December 21, 2024

370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన

- Advertisement -
- Advertisement -

అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి గల సరిహద్దులో ప్రస్తుతం యథేచ్ఛగా రాకపోకలు సాగుతున్నాయి. జాతీయ భద్రత కారణాలతో సరిహద్దులో గల పౌరుల కోసం సైనిక తిరుగుబాటు జరిగిన మయన్మార్‌తో సరిహద్దులో కంచె ఏర్పాటు చేసి, దశాబ్దాలుగా కొనసాగుతున్న వీసా రహిత రాకపోకల విధానానికి స్వస్తి పలకనున్నట్లు కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించింది. సరిహద్దులో కంచె నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం కమిటీ ఒక టి ఈ నెలారంభంలో ఆమోదించిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోద ముద్ర అవసరమని పేరు వెల్లడికి నిరాకరించిన ఆ ప్రతినిధి తెలియజేశారు.

మీడియాతో మాట్లాడేందుకు ఆయనకు అధికారంలేదు. ఈ విషయమై వ్యాఖ్య కోరుతూ పంపిన ఇమెయిల్‌కు ప్రధాని కార్యాలయం, హోమ్, ఆర్థిక, విదేశాంగ, సమాచార ప్రసార మంత్రిత్వశాఖలు వెంటనే స్పందించలేదు. కంచె ఏర్పాటుకు భారత్ యోచనపై మయన్మార్ ఇంత వరకు ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. 2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు దరిమిలా వేలాది మంది పౌరులు, వందలాది మంది భద్రత సిబ్బంది అక్కడి నుంచి జాతిపరమైన, కుటుంబపరమైన సంబంధాలు కలిగి ఉన్న భారతీయ రాష్ట్రాలకు పారిపోయి వచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపరచింది. మతపరమైన ఉద్రిక్తతలు భారత్ విస్తరించే ప్రమాదం ఉండడం ఇందుకు కారణం.

మయన్మార్‌కు ఆనుకుని ఉన్న మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితికి రాకపోకలకు స్వేచ్ఛ ఉన్న సరిహద్దు కూడా కారణమని ప్రభుత్వ సభ్యులు కొందరు ఆరోపించారు. దాదాపుగా ఒక సంవత్సర కాలంగా రెండు జాతుల వర్గాల మధ్య దౌర్జన్య సంఘటనలను మణిపూర్ చూస్తున్నది. ఆ వర్గాలలో ఒకదానికి మయన్మార్ చిన్ తెగతో అనుబంధం ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News