Monday, January 20, 2025

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే..అది రాజకీయ ప్రతీకారమే

- Advertisement -
- Advertisement -

దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అని స్పష్టంగా అర్ధమవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. జైలు నుంచే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చేస్తున్న ప్రకటనలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందిస్తూ ఢిల్లీ పాలన అలా నడవదన్నారు. ఎల్‌జీ చేసిన ఈ ప్రకటనపై ఢిల్లీ మంత్రి అతిశీ మాట్లాడుతూ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.

లెఫ్టినెంట్ గవర్నర్ చెబుతున్న రాజ్యాంగ నిబంధన ఏమిటీ ? వీటికి సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉంది. అటువంటప్పుడు ఏ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారు ? ఆర్టికల్ 356 అంశం అనేకసార్లు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది అని ఢిల్లీ మంత్రి అతిశీ ప్రశ్నించారు. పాలనకు ఏ విధమైన అవకాశాలు లేనప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ రూల్ విధించాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News