Friday, December 20, 2024

సన్‌రైజర్స్ సునామీ

- Advertisement -
- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్త రికార్డును సృష్టించింది. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263/3 పేరిట ఉన్న రికార్డును సన్‌రైజర్స్ తిరగరాసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులు చేయగా, వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

ఇక చివర్లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లోనే 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐడెన్ మార్‌క్రమ్ 28 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. దీంతో హైదరాబాద్ 277 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. కాగా, టి20 చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. టి20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోరును సాధించిన రికార్డు నేపాల్ పేరిట ఉంది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్, చెక్ రిపబ్లిక్ జట్లు 278 పరుగుల స్కోరుతో రెండో స్థానంలో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News