Friday, December 20, 2024

హైకోర్టుల్లోనూ సౌకర్యాల కొరత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు న్యాయం మరింత చేరువ కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆకాంక్షించారు. ఆ విధంగా మార్పులు జ రుగాలని అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ కా లంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో పాటు కోర్టు ల్లోనూ మార్పులు వస్తున్నాయని కీలక వ్యా ఖ్యలు చేశారు. రాజేంద్రనగర్‌లో తెలంగా ణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ యన మాట్లాడారు. దేశంలో యువత సం ఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందని వెల్లడించారు. సత్వర న్యాయం కోసం యువత తాపత్రయ పడుతోం దన్నారు. కొందరికే కాకుం డా సమాజంలో అన్ని వర్గాలకు కో ర్టులు చేరువ కావాలని అభిప్రాయ పడ్డా రు. న్యాయవ్యవస్థల

విలువలు పెంపొం దించేలా సీనియర్లు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ‘కింది కోర్టుల్లోనే కాదు, హైకోర్టులోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉంది. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజెను అభినందిస్తున్నా. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగులు వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలి. న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలి. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వినియోగిం చుకోవాలి. ఇటీవల ఇకోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఇసేవా కేంద్రాలు ఏర్పాటయ్యా’యని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ పి.ఎస్.నర్సింహా, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, హైకోర్టు సిజె జస్టిస్ అలోక్ అరాధే పలువురు న్యాయమూర్తులు, న్యాయ వాదులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News